నడవటమే ఒక ఔషధం

 

ఊరికినే ఇంట్లో అలా కూర్చునే బదులు ఉదయమో, సాయంత్రమో రోజు అలా కాసేపు బయటకు తిరిగి రావటం ఒక అలవాటుగా చేసుకుంటే చాలు . నడక ఫలితం ఊరికనే పోదు తక్కువలో తక్కువగా 25 రకాల  జబ్బుల నుండి కాపాడుతుంది. అంతే కాదు షుగర్ ,బీపి , గుండె జబ్బులు , క్యాన్సర్లు , మోకాళ్ల నొప్పుల తీవ్రత కూడా బాగా తగ్గుతుంది. రోజు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం.

                                                     రోజుల్లో  డాక్టర్ ని కలిసిన డాక్టర్ చెప్పే మాట రోజూ 45 నిమిషాల పాటు నడవమనడం, కుదిరితే అంతకంటే ఎక్కువ సేపు కూడా నడవ వచ్చు దాని వల్ల లాభమే కాని వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే అధిక బరువు, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్గుండెజబ్బులుకీళ్లనొప్పులు, మోకాలి నొప్పులు, ఆందోళన, మానసిక ఒత్తిడి , డిప్రెషన్ ఇలాంటి ఆరోగ్య విపత్తులన్నిటికి అడ్డుకట్ట వేయాలంటే అందరికి అందుబాటులో ఉన్న చక్కనైన మార్గం నడక. అందుకే డాక్టర్లు చెబుతూ ఉంటారు నడవమని.

              నడవడం ద్వారా అనేక రోగాలను తగ్గించుకోవచ్చు నడవడం అనేది మందులలో ఒక భాగమే మందులు ఒకటి వేసుకోవడం అంటే సరిపోదు మందులతో పాటు నడవడం , వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ముఖ్యం.

 

నడక ప్రాముఖ్యత :

                                  నడిచే సమయంలో హార్ట్ రేట్  పెరుగుతుంది , బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది ఇవన్నీ మెడికల్ లాంగ్వేజ్ లో ఫిజియో లాజికల్ లిమిట్స్ అంటారు ఎంత వరకు అంటే హానికరం కానంత స్థితి వరకు పెరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే పెరగాలి కూడా అది కరెక్ట్ బాడీ ఫంక్షనింగ్,  అలా పెరిగినప్పుడు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

                             ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రక్తపోటు , మధుమేహం కి ఇండియా రాజధాని. కాబట్టి వీటిని సులువుగా నివారించే పద్ధతి నడవడం , అదేవిధంగా విటమిన్ డి ,క్యాల్షియం పెరగడానికి నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు నడవడం వలన శరీరంలో ఇమ్యునిటీ శక్తి కూడా బాగా పెరుగుతోంది నడవడం వల్ల ఉద్యోగ మరియు వ్యాపార సంబంధమైన  ఒత్తిళ్లను తగ్గించుకోవచ్చు.

నడిచే పద్ధతి

    నడవడం అంటే కేవలం అడుగులు వేసి నడవడం కాదు నడిచే ముందు, నడిచేటప్పుడు , నడక ముగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నడకకు సంబంధించి 3 శాస్త్రీయ సూత్రాలు ఉన్నాయి అవి వామప్, వాకింగ్కూల్ డౌన్.  నడవడం కంటే ముందు నడవటానికి వీలుగా ఉండడానికి శరీరాన్ని వ్యాయామంతో సిద్ధం చేసే విధానాన్ని వామప్ అంటారు. తర్వాత వాకింగ్ చెయ్యాలి చివరిగా ఐదు నిమిషాలు శరీరాన్ని తిరిగి సహజ స్థితికి తీసుకురావడం ఇది పూర్తి స్థాయి నడక అంటే.

                              10 నిమిషాలలో ఒక కిలోమీటర్ నడిచేటట్టు నడవాలి. నడిచే ముందు నేల ఎత్తుపల్లాలు లేకుండా చూసుకొని నడవాలి,  నడిచేటప్పుడు సరైన బూట్లు , బట్టలు ధరించాలి . నడవడం మొదలు పెట్టిన తర్వాత మొదటగ నిదానంగా నడవాలి తర్వాత కాస్త వేగం పెంచుకుంటూ వేగంగా నడవాలి చివరిగా నడక ముగించే ముందు నిదానంగా నడుస్తూ నడకను ముగించాలి.

Comments

Popular posts from this blog

లైఫ్ స్టైల్ లో మార్పు