లైఫ్ స్టైల్ లో మార్పు
లైఫ్ స్టైల్ ను ఈ విధంగా మార్చుకోవాలి:
మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. రోజు సూర్యోదయం కంటే ముందుగా లేవడం మంచి అలవాటుగా చేసుకోండి. రోజు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని శుభ్రముగా ముఖము తోముకొని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ప్రతిరోజు ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించండి. ఈ గంట సమయంలో ఇరవై నిమిషములు సూర్య నమస్కారాలు చేసుకోవడానికి, మిగిలిన 40 నిమిషములు మట్టి నేల పై నడవడానికి కేటాయించండి. వ్యాయామం పూర్తి అయిన తరువాత ఒక గ్లాసు మంచినీరు త్రాగి 20 నిమిషాలు పాటు అలసట చెందిన శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. రోజు దిన పత్రికలు చదివే అలవాటు అలవరుచుకోండి.
పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోండి. ప్రతి అర గంటకు ఒక గ్లాసు మంచినీరు తాగే అలవాటును అలవరుచుకోండి. అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్య సమయంలో ఒక గ్లాసు జ్యూస్ తీసుకునే అలవాటు అలవరుచుకోండి. మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు మంచి నీరు త్రాగాలి.
మధ్యాహ్న భోజనం చేసే సమయంలో ఎటువంటి నీరు తీసుకోకుండా భోజనం ముగించాలి. (మధ్యాహ్న భోజన సమయంలో మంచి నీరు తాగటం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది) భోజనం చేసిన రెండు గంటల తర్వాత ప్రతి గంటకు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగడం అలవరుచుకోవాలి.
ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు. కూరగాయల జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇక రాత్రి భోజనాన్ని ఏడు గంటల లోపు తేలికపాటి ఆహారాన్ని సేవించి ముగించడం మంచిది.
Comments
Post a Comment