నడవటమే ఒక ఔషధం
ఊరికినే ఇంట్లో అలా కూర్చునే బదులు ఉదయమో , సాయంత్రమో రోజు అలా కాసేపు బయటకు తిరిగి రావటం ఒక అలవాటుగా చేసుకుంటే చాలు . ఈ నడక ఫలితం ఊరికనే పోదు తక్కువలో తక్కువగా 25 రకాల జబ్బుల నుండి కాపాడుతుంది. అంతే కాదు షుగర్ , బీపి , గుండె జబ్బులు , క్యాన్సర్లు , మోకాళ్ల నొప్పుల తీవ్రత కూడా బాగా తగ్గుతుంది . రోజు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం . ఈ రోజుల్లో ఏ డాక్టర్ ని కలిసిన డాక్టర్ చెప్పే మాట రోజూ 45 నిమిషాల పాటు నడవమనడం, కుదిరితే అంతకంటే ఎక్కువ సేపు కూడా నడవ వచ్చు దాని వల్ల లాభమే కాని వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే అధిక బరువు, మధుమేహం , హై బీపీ , కొలెస్ట్రాల్ , గుండెజబ...