Posts

నడవటమే ఒక ఔషధం

  ఊరికినే ఇంట్లో అలా కూర్చునే బదులు ఉదయమో , సాయంత్రమో రోజు అలా కాసేపు బయటకు తిరిగి రావటం ఒక అలవాటుగా చేసుకుంటే చాలు . ఈ నడక ఫలితం ఊరికనే పోదు తక్కువలో తక్కువగా 25 రకాల   జబ్బుల నుండి కాపాడుతుంది. అంతే కాదు షుగర్ , బీపి , గుండె జబ్బులు , క్యాన్సర్లు , మోకాళ్ల నొప్పుల తీవ్రత కూడా బాగా తగ్గుతుంది . రోజు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం .                                                      ఈ రోజుల్లో  ఏ డాక్టర్   ని కలిసిన   డాక్టర్   చెప్పే మాట రోజూ 45 నిమిషాల పాటు నడవమనడం, కుదిరితే అంతకంటే ఎక్కువ సేపు కూడా నడవ వచ్చు దాని వల్ల లాభమే కాని వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే అధిక బరువు, మధుమేహం , హై బీపీ , కొలెస్ట్రాల్ ,  గుండెజబ...

లైఫ్ స్టైల్ లో మార్పు

 లైఫ్ స్టైల్ ను ఈ విధంగా మార్చుకోవాలి:                               మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని  నిర్దేశిస్తాయి. రోజు సూర్యోదయం కంటే ముందుగా లేవడం మంచి అలవాటుగా చేసుకోండి. రోజు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని శుభ్రముగా ముఖము తోముకొని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ప్రతిరోజు ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించండి. ఈ గంట సమయంలో ఇరవై నిమిషములు సూర్య నమస్కారాలు చేసుకోవడానికి, మిగిలిన 40 నిమిషములు మట్టి నేల పై నడవడానికి కేటాయించండి. వ్యాయామం పూర్తి అయిన తరువాత ఒక గ్లాసు మంచినీరు త్రాగి 20 నిమిషాలు పాటు అలసట చెందిన శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.  రోజు దిన పత్రికలు చదివే అలవాటు అలవరుచుకోండి.                                      పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోండి. ప్రతి అర గంటకు ఒక గ్లాసు మంచినీరు తాగే అలవాటును అలవరుచుకోండి. అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్య సమయంలో ఒక గ్లాసు జ్యూ...